త్రివిధ దళాలకు స్వేచ్ఛ

ఎయిర్ మార్షల్ తో మోదీ భేటీ తాజా పరిస్థితిపై వ్యూహరచన జయజయహే : భారత వాయుసేన అధినేత ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని తన లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఆదివారం నాడు ప్రధాని మోదీతో ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ భేటీ అయ్యారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ఈ భేటీ...