అలసత్వం చేసిన పోలీసులపై ఆగ్రహం
శ్రీ సత్యసాయి జిల్లా: జయజయహే : రాప్తాడు మాజీ ఎంఎల్ఏ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని అరెస్ట్ చేసే విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయింది. అతనిని అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని డీజీపీ కార్యాలయం కోరింది. 20 రోజులుగా ప్రకాష్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం వెనుక ఓ డీఎస్పీ, సీఐ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు సమాచారం అందించారు. దీంతో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి.

