Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీతెలుగు భాషను కాపాడుకోవాలి - మేయర్ పీలా శ్రీనివాసరావు

తెలుగు భాషను కాపాడుకోవాలి – మేయర్ పీలా శ్రీనివాసరావు

జయజయహే : శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమాండ ప్రతాప్ మరియు కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి ఆధ్వర్యంలో ఈ నెల 10,11 తేదీల్లో ఏలూరు లో జరుగనున్న అంతర్జాతీయ తెలుగు మహా సంబరాలకి సంబందించిన పోస్టర్ ను జీవియంసి మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు భాషని కాపాడుకొనే ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చైర్మన్ డా. కత్తిమాండ ప్రతాప్ సేవలు చిరస్థాయుగా నిలిచిపోతాయిన్నారు. వి.జె. ఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒక కళా సంస్థ ఇంత పెద్ద ఎత్తున తెలుగు సంబరాలు ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. కళావేదిక గౌరవ అధ్యక్షుడు సత్తివాడ శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి కవులు రచయితలు ఆ సభకి తరలి రావాలని కోరారు.. ఈ కార్యక్రమం లో కళావేదిక కార్యదర్శి సత్యాడ నర్సింగ రావు, కళావేదిక సభ్యులు రత్నం రామ్ గోపాల్, పి ఆర్. ఓ ఇమంది నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?