Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీతెలంగాణ తాటి కల్లు తాగిన అందాల ముద్దుగుమ్మలు..

తెలంగాణ తాటి కల్లు తాగిన అందాల ముద్దుగుమ్మలు..

జయజయహే : తెలంగాణ సంప్రదాయంలో ఒకటి నీరా(తాటి కల్లు). తాటి, ఈత చెట్టు నుంచి నీరాను సేకరిస్తారు. చూడ్డానికి కొబ్బరి నీళ్లలాగే ఉన్నా.. తాగితే మాత్రం తాటి ముంజలు తిన్న ఫీలింగ్ వస్తుంది. అలా తాగే కొద్దీ తెగ నచ్చేస్తుంది అదే నీరా స్పెషల్. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేప్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ఈ కార్యక్రమాలను ఆవిష్కరించారు. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ పోటీల ద్వారా వరల్డ్ వైడ్ గా హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాక తెలంగాణ పర్యాటక రంగానికి కూడా ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ మిస్ వరల్డ్ వేడుకలకు హాజరయిన ముద్దుగుమ్మలు తెలంగాణ సంప్రదాయమైన నీరా కల్లును తాగారు. ప్రపంచ అందగత్తెలు తెలంగాణకు చెందిన ఈ తాటి కల్లును సేవించి వావ్ అన్నారు. దాని రుచికి ఫిదా అయ్యారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన సుందరీమణులను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరిస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ పోటీలు ఒక గొప్ప వేదికని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇక ఇవాళ మిస్ వరల్డ్ సుందరీమణులు నాగార్జునసాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్‌ వరల్డ్‌ పోటీదారులు నాగార్జున సాగర్‌ లోని విజయ విహార్‌ అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ తర్వాత మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. ఇక విజయ్ విహార్ నుంచి బుద్ధ వనానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?