Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీతిరుమలలో చిరుత సంచారం కలకలం

తిరుమలలో చిరుత సంచారం కలకలం

ఆంధ్రప్రదేశ్ : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. స్కూటీ మీద కొండపైకి వెళ్తున్న భక్తులకు రెండో ఘాట్ రోడ్డులో చిరుత కనిపించగా వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారి సమాచారంతో విషయం తెలుసుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత సంచరిస్తుందన్న సమాచారం తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ పలుమార్లు తిరుమలలో చిరుత సంచరించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?