తిరుమలరావు దానవీరశూరకర్ణ కవితకు ప్రశంసాపత్రం
శ్రీకాకుళం జిల్లా, జయజయహే : కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ప్రశంసాపత్రం సాధించారు. రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు డా.దూత రామ కోటేశ్వరరావు నేతృత్వంలో నచ్చిన సినిమా అను అంశంపై కవిత పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన దానవీరశూరకర్ణ అనే కవిత ఎంపికై ప్రశంసాపత్రం సాధించింది. ఈమేరకు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, సుర్దేపల్లి కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన కవితల పోటీలకు కవిత పంపిన తిరుమలరావును అభినందిస్తూ...