తారక‌రామా తీర్ధ‌సాగ‌ర్‌ను పూర్తిచేస్తాం త్రాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ప్రాజెక్టు కీల‌కం జ‌ల‌వ‌నరుల శాఖామంత్రి నిమ్మ‌ల రామానాయుడు

విజ‌య‌న‌గ‌రం జయజయహే: తార‌క‌రామా తీర్ధ‌సాగ‌ర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖామంత్రి నిమ్మ‌ల రామానాయుడు అన్నారు. గుర్ల మండ‌లం ఆనంద‌పురం వ‌ద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ ప‌నుల‌ను ఆయ‌న మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ముందుగా ప్రాజెక్టువ‌ద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను, ప్రాజెక్టు మ్యాపుల‌ను తిల‌కించారు. ప్రాజెక్టు ఇంజ‌నీర్ల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం బ్యారేజ్‌ను ప‌రిశీలించారు. ప్ర‌జ‌ల‌నుంచి విన‌తిప‌త్రాల‌ను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు....