డీజీపీ హరీశ్ గుప్తాతో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం
డీజీపీ తో పలు సమస్యలపై చర్చించిన మంత్రి ఈగిల్ దళం కార్యాచరణ, ప్రణాళిక అంశాలపై మంత్రి చర్చ మంగళగిరి : జయజయహే : సరైన పర్యవేక్షణ, నిఘాతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం విరివిరిగా తగ్గించి, సామాన్యుల జీవితాలు, కుటుంబాలు నాశనం కాకుండా యువతతో పాటు ముక్కుపచ్చలారని విద్యార్థులు, చిన్నారులను ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టాలని, ప్రత్యేకంగా అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టాలని మంగళగిరి లోని డైరెక్టర్...