Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీటీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ. - జగన్ మాస్ వార్నింగ్..!!

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ. – జగన్ మాస్ వార్నింగ్..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీగా పేర్కొన్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం.. తనను తిట్టటం కాదని.. ఇచ్చిన హామీలు అమలు చేయటమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులతో చెడు సంప్రదాయం తీసుకొచ్చారని…రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని జగన్ విమర్శించారు.

కీలక వ్యాఖ్యలు ఏపీలో కూటమి పాలన పైన మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేసారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండల నేతలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజా రాజకీయ పరిణామాలు, భవి ష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేసారు.రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు.టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టో లు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు.
తెలుగు డ్రామా పార్టీ.

టీడీపీ సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందని చెప్పుకొచ్చారు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవు దని ప్రశ్నించారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నార న్నారు. రాజకీయాల్లో విలు లు, విశ్వసనీయత ఉండాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నార ని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా లాంటి మహ రి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదన్నారు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదని చెప్పారు.
దేనికైనా సిద్దం రాజకీయంగా ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నామని జగన్ వెల్లడించారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో హత్యలు జరిగాయని.. ఇప్పుడు మన పార్టీ ఇన్‌ఛార్జి పిన్నెల్లిమీద కేసులు పెట్టారని చెప్పారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారన్నారు. ఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుం ని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు. కార్యకర్తల బాగోగులను చూసుకుంటామన్నారు. కార్యకర్త కు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నామన్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోవాలని సూచించారు. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీ సమా రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తామని జగన్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?