Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీజైళ్లకు భయపడేది లేదని జగన్ తేల్చి చెప్పారు...ఎంపీ మిథున్ రెడ్డి

జైళ్లకు భయపడేది లేదని జగన్ తేల్చి చెప్పారు…ఎంపీ మిథున్ రెడ్డి

ఏపీలో లిక్కర్ కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేత లు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈడీ ఈ కేసులో విచారణ కు సిద్దం అయింది. రాజ్ కసి రెడ్డి స్టేట్మెంట్ తీసుకోనుంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కాగా, లిక్కర్ కేసు అంశం పైన వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

లిక్కర్ కేసు విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల‌కు చెందిన పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, అనుబంధ విభా ల నేత‌ల‌తో మిథున్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఏడాదిగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వమ‌న్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్ల ఎండీయూ వాహ‌నాల‌పై ఆధార‌ప‌డ్డ 10 వేల కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌న్నారు.ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన సంక్షేమ ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేసి చంద్ర‌బాబు రాక్ష‌సానందం పొందుతున్నారని మండిపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు మద్యం కుంభకోణం జరగలేదన్నారు. కట్టు థలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మిథున్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు.. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష్య సాధింపులు పెరిగాయని… వైసీపీ శ్రేణులను వేధిస్తు న్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పేరుతో కేసులు..అరెస్ట్ లతో భయ పడేది లేదని మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇదే కేసు గురించి జగన్ సైతం సీరియస్ గా స్పందించారు. మ్యాను క్చర్‌ విట్నెస్‌ సృష్టిస్తున్నారని మండి పడ్డరు. వారికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ను అప్రూవర్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మ్యానుఫ్యాక్చర్‌ ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేస్తూ ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పించి అరెస్టు చేస్తున్నారన్నారు. కేసులు.. జైళ్లకు భయపడేది లేదని జగన్ తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?