జూన్ 7వ తేదీ నుంచి రేషన్ కొత్త కార్డుల మంజూరు..

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జూన్ 7వ తేదీ నుంచి కొత్త కార్డుల మంజూరు చేయాలని నిర్ణయించింది. రైస్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులతో పాటుగా కార్డుల్లో పేర్ల మార్పులు - చేర్పుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఆన్ లైన్ విధానంలో స్వీకరించాలని తొలుత నిర్ణయించారు. కాగా, సర్వర్ సమస్యలతో పాటుగా సాంకేతిక కారణాలతో వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆన్ లైన్ సేవల ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన మిత్ర ద్వారా...