జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణీ.. మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. జూన్ 1 నుంచి వీటిని అందించనుంది. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని...