జూన్ నుంచి చౌకదుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం…నాదెండ్ల మనోహర్
ఏపీలో రేషన్ పంపిణీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ సర్కార్ రేషన్ ను నేరుగా ఇంటికే అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. వీటిని కూటమి సర్కార్ రాగానే దాదాపుగా పక్కనబెట్టేసింది. ఇప్పుడు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రేషన్ డెలివరీ వాహనాల వల్ల రేషన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అందుకే...