జీవీఎంసీ యు సి డి అధికారులతో నగర మేయర్ సమీక్ష

విశాఖపట్నం: జయజయహే : విశాఖ నగరంలో అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జీవీఎంసీ యూసీడీ విభాగం సకాలంలో అందించాలని, మహిళల ఆర్థిక పురోగతికి సహకరిస్తూ చిత్తశుద్ధితో అధికారులు విధులను నిర్వహించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యు సి డి) సత్యవేణి, ఇతర యు సి డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ...