SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 7:59 am Posted by : SHIVASURYA NEWS

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఫై అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యుల మద్దతు.

విశాఖ జిల్లా కలెక్టర్, ప్రెసైడింగ్ అధికారి ఎంఎన్.హరేంధిర ప్రసాద్.

విశాఖపట్నం జయజయహే : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యులు మద్దతు తెలిపారని విశాఖ జిల్లా కలెక్టర్ మరియు ప్రెసైడింగ్ అధికారి ఎంఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశం మందిరంలో డిప్యూటీ మేయర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ మరియు ప్రెసైడింగ్ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు 63 మంది హాజరయ్యారని, ఎక్స్ అఫీషియో సభ్యులైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు 11 మంది తో కలిపి మొత్తం 74 మంది సభ్యులు హాజరయ్యారన్నారు, ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి కోరం సరిపోయినందున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడ మైనదని, 74 మంది సభ్యులు అవిశ్వాసానికి వారి మద్దతును తెలిపారన్నారు. ఎవరు కూడా ప్రతిపాదననకు వ్యతిరేకంగా గాని, తటస్థంగా గానీ లేరన్నారు. ఈ అవిశ్వాస తీర్మానం పై వచ్చిన మద్దతును అంగీకరించి, తీర్మాణం ఆమోదిండమైనదని, తదుపరి చర్య కొరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు.