Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీజాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన

950 మంది హాజరు 285 మందికి ఉద్యోగాలు

విద్యార్థులను అభినందించిన ..ఎంపీ

జాబ్ మేళాలు యువతకు ఉపయోగకరం.. ఎమ్మెల్యే

చోడవరం: జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం చోడవరం పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు సుమారు 950 మంది హాజరవుగా వారిలో 285 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు తదితరులు హాజరై విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి వాటి ద్వారా వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు మెగా జాబ్ మేళాలను నిర్వహించటం వలన స్థానిక నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారికి నచ్చిన కంపెనీకి ఇంటర్యూకు హాజరై, ఉద్యోగం పొందాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్థానికంగానే కాకుండా ఎక్కడ జాబ్ వస్తే అక్కడ జాయిన్ అయి ఆ ఆదాయంతో కుటుంబాన్ని తీర్చిదిద్దగలరని నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందవద్దని, ఈరోజు నిర్వహించిన ఇంటర్వ్యూ అనుభవంతో భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొందుటకు అవకాశం కలదని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ మధ్యాహ్నం సమయంలో ఈ కార్యక్రమం లో పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్న రూమ్స్ వద్దకి వెళ్లి జాబ్ మేళా జరుగు విధానమును పరిశీలించి హెచ్ ఆర్ తో , జాబ్ మేళలో పాల్గొన్న నిరుద్యోగ యువతతో ముచ్చటించారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అదికారి గోవిందరావు మాట్లాడుతూ ఈజాబ్ మేళాకు సుమారుగా 23 బహళ జాతీయ కంపెనీలు హాజరయ్యాయని అలాగే 1600 ఖాళీలు వివిధ కంపెనీలో ఉన్నాయని చెప్పారు. ఈరోజు జరుగుతున్న ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుండి పీజీ వరకు అలాగే ఐటి, డిప్లమో, బీటెక్, బి బి ఏ, ఎం బి ఏ, బి ఏ, బీకాం, బీఎస్సీ కి సంబంధించి ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికంగా కానీ ఇతర ప్రదేశాల్లో కూడా ఉద్యోగ అవకాసం పొందిన వారు నియామకం పత్రం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని, అది దూరమా దగ్గర అని చూడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.ఈ జాబ్ మేళాలో 23 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొని 945 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరుకాగా 285 మంది వివిధ కంపెనీ లకు ఎంపిక కావటం జరిగిందని, సుమారు 100 మందికి ఉద్యోగ మేళా నిర్వహించిన చోటే శాసన సభ్యులు కె ఎస్ ఎన్ రాజు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో చోడవరం నియోజకవర్గం ఎంపీపీ లు, ఇతర పార్టీ నాయకులు,కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

                                     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?