జనసేన పార్టీకి కార్యకర్తల బలమే ప్రధాన శక్తి
పార్టీ కార్యకర్తలంతా నా ఆత్మ బంధువులు
క్రియాశీలక సభ్యుల బీమా పరిహారం సొమ్ము పెంచాలన్న ఆలోచన ఉంది
ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి
కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయను
క్రియాశీలక పంపిణీ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో పవన్ కళ్యాణ్
అమరావతి: ‘జన సైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీకి ప్రేరణ. వారి ఆకాంక్షలు, అభిమానమే కోసం ఇంధనం. వారి నమ్మకం సమాజహితమే పార్టీకి ఆస్తి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మతాలు, కులాలు, సంస్కృతులను దాటి భిన్నమైన వాతావరణంలో పెరిగిన ఓ సమూహం తాలూక ప్రాంతాల్లో బలమైన ఆశయానికి జనసేన పార్టీ వేదిక అని చెప్పారు. పార్టీ క్రియాశీలక పార్టీ కిట్ల పంపిణీ మంగళవారం సాయంత్రం స్వచ్ఛందంగా ప్రసారమైన వారితో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నేను మానవత్వాన్ని నమ్ముతాను. కొన్ని సార్లు కులాలు, మతాల ప్రస్తావన నా మాటల్లో వచ్చినా అంతిమంగా ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని, మనిషికి మనిషి తోడ్పడాలి అన్నదే నా అంతరార్ధం. గుర్రం జాషువా చెప్పినట్టు విశ్వ నరుడిగా బతకాలన్నది నా ఆకాంక్ష. కులం, మతం, ప్రాంతం దాటి మనిషిగా బతకాలన్నదే నా ఆకాంక్ష.
పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం.. ఆపదలో భరోసా ఇవ్వగలం
పార్టీ క్రియాశీలక సభ్యులకు రూ. 5 లక్షల బీమా ప్రమాదాన్ని కల్పిస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్లగలం అనే భావన రాలేదు. మంచి సంకల్పంతో ఎంతో మందికి బీమా సొమ్మును అందించగలిగాం. బీమా పరిహార సొమ్మును మరింత పెంచాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దీని సాధ్యాసాధ్యాలను బీమా కంపెనీలతో మాట్లాడుతున్నాము. పాలనలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులకు జనసేన పార్టీ క్రియాశీలక ప్రేరణతోనే ప్రమాద బీమా చేయిస్తున్నాం. ఉపాధి శ్రామికులకు కూడా బతుకు భరోసా ఇవ్వాలి అనేది పార్టీ నుంచి స్ఫూర్తి పొందిన గొప్ప విషయం. పెహల్గాం ఘటనలో మృతి చెందిన 26 మందిలో క్రియాశీలక జనసైనికుడు ఉంటాడని నేను ఊహించలేదు. వారికి తగిన విధంగా పార్టీ నుంచి సహాయం చేయగలిగాం. మనం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము గాని, ఆపదలో వారికి ఆర్థిక భరోసా అందించే బాధ్యతను తీసుకున్నాం.
దేశమంటే విపరీతమైన అభిమానం:
జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు సమాజానికి ఏదైనా చేయాలన్న బలమైన సంకల్పం తప్ప మరో ఆలోచన లేదు. దేశమంటే చిన్నప్పటి నుంచి ఎందుకో విపరీతమైన అభిమానం. చరిత్ర చదువుతున్నప్పుడల్లా ఎందరో బలిదానాలు, ఆత్మత్యాగాలు మీద మనం బతుకుతున్నామన్న గొప్ప అనుభూతి నాకు ప్రతిసారి కలుగుతుంది. దేశం నుంచి తీసుకోవడం కాదు. ఏదైనా ఇవ్వాలన్న బలమైన సంకల్పంతోనే పార్టీని స్థాపించాము. ఓటమిలో ఎదిగిన పార్టీ జనసేన పార్టీ. జనసేనకు కార్యకర్తలే బలం. సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, దేశానికి ఏదైనా ఇవ్వాలన్న ఉత్సాహం ఓ సమూహంలో ఉంటే వారందరి ఒకే రకమైన ఆలోచనా విధానం అయితే అది జనసేన పార్టీ అవుతుంది. నేను ఒక్కడినే వేసిన అడుగుకు లక్షలాది మంది పదం కదిపారు. అది మహా సంకల్పంగా మారింది. ఇంత మంది నాపై పెట్టుకున్న భరోసాను ఎప్పుడూ వమ్ము చేయను. మీకు నచ్చని పని చేయను. ముందుగా నా జీవితాన్ని రిస్కులో పెట్టుకుంటాను తప్ప మీ జీవితాన్ని రిస్కులో పెట్టుకుంటాను. మీరంతా నా ఆత్మ బంధువులు. మీ స్థానం నా మనసులో పదిలంగా ఉంటుంది” అన్నారు.


