జనసేన సైనికుల దెబ్బకు మారిన ఆహ్వాన పత్రిక…
మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే, ఈ భారీ ఈవెంట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేకపోవటం పైన జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో, ప్రభుత్వం ఆహ్వాన పత్రికలో మార్పు చేసింది. పవన్ పేరును జత చేస్తూ కొత్తగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తోంది. అమరావతి...