జగన్ కు హోంమంత్రి అనిత సవాల్..!
ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణితో ప్రారంభిస్తే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వరకూ వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలకు దిగుతోంది. వీటిపై హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అధికారుల అరెస్టులు జరగడం లేదని, వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నట్లు హోంమంత్రి...