SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 6:49 am Posted by : SHIVASURYA NEWS

చిన్నారులు హర్షిత, వర్షితల ఆలోచనకు సలాం

సంఘసేవకులు ఉర్లం.శివతేజ పట్నాయక్

శ్రీకాకుళం: జయజయహే : చిన్నారులు హర్షిత, వర్షితల ఆలోచనకు సలాం అని సంఘసేవకులు, సామాజిక కార్యకర్త, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్ పర్సన్ ఉర్లం. శివతేజ పట్నాయక్ సోమవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి.విజయ్ కుమార్ కుమార్తెలు హర్షిత, వర్షితలు స్థానిక గొంటి వీధిలో నిరుపేదలకు అన్నవితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారుల తండ్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం. శివతేజ నగరంలో ముఖ్య కూడలితోపాటు, నైట్ షెల్టర్ లో చేస్తున్న సేవలు చూస్తున్నామని, ఇక్కడ నిస్సహాయవృద్ధుల కోసం, నిరంతరం ఎవరో ఒకరి సాయంతో నిరుపేదల ఆకలి తీరుస్తున్నారని, నేను గత పద్దెనిమిది రోజుల నుండి, నగరంలో ఉండే అభాగ్యులకు నా వంతు సహకారమందిస్తున్నానన్నారు. ఈ రోజు నా కుమార్తెలు కోరిక మేరకు ఇక్కడ ఉండే అభాగ్యులకు ఆహారాన్ని అందించారని, దాతలు ముందుకు వచ్చి వీరి ఆకలి తీర్చాలన్నారు. ఉర్లం. శివతేజ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అన్నార్థులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి స్ఫూర్తితోనే నగరంలో అనేక ప్రదేశాలలో అన్నవితరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, నేటి దాత బాడీ బిల్డర్ విజయ్ కు, చిన్నారుల ఆలోచనకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డర్ వి. విజయ్ కుమార్, చిన్నారులు, నైట్ షెల్టర్ బాధితులు పాల్గొన్నారు.