చంద్రబాబు హామీలన్నీ బూటకం… ఆర్.కె.రోజా

విజయవాడ: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. హామీలన్నీ బూటకం..తొలి సంతకమే చిత్తు కాగితం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారడీ మాటలు చెప్పి,లేనిపోని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని మాజీ మంత్రి రోజా అన్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆమె...