SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 11:47 am Posted by : SHIVASURYA NEWS

ఘనంగా గురాన అయ్యలు జన్మదిన వేడుకలు

విజయనగరం : జయజయహే : జనసేన నాయకులు గురాన అయ్యలు జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెలుగు ఆశ్రమం, నిరాశ్రయుల వసతి గృహం, చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది లెర్నింగ్ డిసేబుల్డ్‌ హోమ్ లో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం జీఎస్‌ఆర్‌ హోటల్‌లో అభిమానులు సమక్షంలో బర్త్‌డే కేక్‌ను కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో అయ్యలు కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తన పుట్టినరోజున అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో జనసేన బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ పెద్దల సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.