గ్లోబల్ స్థాయిలో వాసవి మాత జయంతి వేడుకలు

పలు సేవా కార్యక్రమాలు - అంతర్జాతీయ అధ్యక్షులు రామకృష్ణ విశాఖపట్నం : జయజయహే : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవాలు ఈనెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో గల అన్ని క్లబ్బులతో పాటు ప్రపంచంలో గల 33 దేశాల్లో ఉన్న క్లబ్లోను అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనేకచోట్ల సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, గో సేవ ,...