SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 9:29 am Posted by : SHIVASURYA NEWS

గ్రామంలో సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి: జి వెంకట్రామిరెడ్డి

నందవరం,(శివసూర్య)

సోమలగూడూరు గ్రామంలో ఎమ్మెల్యే బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకుడు జి వెంకట్రామిరెడ్డి గ్రామంలో సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. గ్రామంలో ప్రజలకు ఏమైనా అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే రెవెన్యూ భూములు పరంగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను ఉద్దేశించి సూచించారు. గ్రామంలో వీధి వీధిలో పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ సిసి రోడ్లు వేయాలో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు ఈనెల 25 జరగబోయే క్రిస్మస్ పండుగను ప్రశాంతంగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని సూచించి ఎస్సీ కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే అంగన్వాడి కేంద్రాన్ని తనకి చేపట్టారు ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కే వెంకట్రామిరెడ్డి, చంద్ర, మాజీ ఎంపిటిసి నరసింహులు, మునుస్వామి, తెలుగు వీరేష్, మధు, సతీష్, సోమన్న, రామాంజనేయులు, సురేష్, మాజీ సర్పంచ్ సోమన్న, తిమ్మప్ప టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.