Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీగోరంట్లకు బెయిల్

గోరంట్లకు బెయిల్

మంజూరు చేసిన గుంటూరు కోర్టు

జయజయహే : వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం నగరం పాలెం పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలంటూ ఆదేశించింది. కాగా పదివేల పూచికత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరు చేసింది. కాగా చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆయన అడ్డగించారు. అంతేకాక అతని అంతు చూస్తామని బెదిరించారు. కిరణ్‌ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు వరకూ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించారు. ఈ క్రమంలో విధులను అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్ సమయంలో పోలీసుల విధులకు గోరంట్ల మాధవ్‌ ఆటంకం కలిగించారని ఎస్పీ తెలిపారు. ఇలా పోలీసుల విధులకు ఆటంకం కలిగించటం నేరపూరితచర్య అని పేర్కొన్నారు. చుట్టుగుంట వద్ద పోలీస్‌ వాహనాన్ని అనుచరులతో కలిసి మాధవ్ అడ్డుకున్నారని ఇంక మాధవ్‌తో పాటు మరో ఐదుగురు ఈ దాడిలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. అంతే కాకుండా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని అతనితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?