SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 10:02 am Posted by : SHIVASURYA NEWS

గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు..!! హత్యకు 5 రోజుల ముందు నుండే మనిషికి ఎక్కడ నరాలు తెగితే చనిపోతాడో గూగుల్‌లో వెతికిన ఓం ప్రకాశ్ భార్య పల్లవి..

జయజయహే : ఓం ప్రకాశ్‌ను చంపేశాక దుర్మార్గుడిని చంపేశా అంటూ వాట్సాప్ లో పల్లవి పలువురికి మెసేజ్ చేసింది. ఓం ప్రకాశ్ తనను, తన కూతురిని హింసించాడని, తమను ఒక గదిలో బంధించి ఉంచాడని పోలీసుల విచారణలో పల్లవి తెలిపింది . ఓం ప్రకాశ్ తన కొడుకుతో, తన చెల్లితో ఎక్కువగా ఉండేవాడని.. దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కూడా కొడుకు, చెల్లికి చేయాలని అనుకున్నాడని భార్య పల్లవి విచారణలో తెలిపింది ..తమను తీవ్రంగా హింసించడం, ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంతో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను భార్య పల్లవి, కూతురు కృతి చంపేశారు .