SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 7:06 am Posted by : SHIVASURYA NEWS

గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

గత రెండేళ్లలో గుండె పోటు కేసులు పెరిగాయి.. డా కృష్ణంరాజు

భీమవరం : జయజయహే : గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి వ్యాయామం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని హైదరాబాద్ కేర్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డా పెన్మెత్స కృష్ణంరాజు అన్నారు. భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద పంక్షన్ హాల్లో ఆదివారం ” గుండె చప్పుడు ” గుండె జబ్బుల నివారణ పై ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. డా కృష్ణంరాజు మాట్లాడుతూ చిన్న పిల్లలతో సహా అన్నీ వయసుల వారు ఎక్కువగా గుండె సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతున్నారని, దీంతో గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. భారతదేశంలో గుండెపోటు కేసులు 12.5 శాతం వరకు పెరిగాయని, గత రెండేళ్లకు ముందు 28,413 మరణాలు సంభవించగా, ఇటీవల రెండేళ్లలో 32,457 మంది వ్యక్తులు గుండెపోటుకు గురయ్యారన్నారు. పలువురు డాక్టర్లు, ప్రజలు గుండె జబ్బులపై పలు ప్రశ్నలు అడిగారు. దానికి డా కృష్ణంరాజు క్లుప్తంగా సమాధానాలు అందించారు.కార్యక్రమంలో పిఆర్ కే వర్మ, బలరామ రాయప్రోలు భగవాన్, భట్టిప్రోలు శ్రీనివాసరావు బొండా రాంబాబు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి,కాట్రేడీ సత్యనారాయణ కె. వి. రమణమూర్తి, పేరిచర్ల లక్ష్మణ వర్మ, కృతివేంటి సత్యకుమార్, పెన్నాడ శ్రీనివాస్, ఎమ్. రమణ మూర్తి, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.