SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 10:13 am Posted by : SHIVASURYA NEWS

గాడ్సే చివరి కోరిక? ఆయన అస్థికలు.. సింధూ నధిలో కలిపే సమయం వచ్చిందా!

సింధూ నధి స్వేచ్ఛ కోసం 75 ఏండ్ల నిరీక్షణ.

జయజయహే : గాంధీని కాల్చి చంపిన నథూరామ్ గాడ్సేను ఉరితీసి 75 ఏళ్లకు పైగా గడిచినా, ఆయన చితాభస్మం ( అస్థికలు) మాత్రం ఇంకా ఆయన చివరి కోరిక నెరవేరే సమయం కోసం వేచి చూస్తున్నాయి. గాడ్సే చివరి కోరిక మేరకు, అవిభక్త భారతదేశం తిరిగి ఏర్పడి సింధు నది స్వేచ్ఛగా ప్రవహించే వరకు ఆయన అస్థికలను అందులో కలపకుండా భద్రంగా ఉంచారు. 1949 నవంబర్ 15న అంబాలా సెంట్రల్ జైలులో గాడ్సేను ఉరితీసిన అనంతరం అక్కడే రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, హిందూ మహాసభ కార్యకర్త ఒకరు చితాభస్మాన్ని సేకరించి నాసిక్‌కు చేరవేశారు. అక్కడి నుంచి గాడ్సే కుటుంబ సభ్యులకు పంపించారు. తన మరణానికి ముందు గాడ్సే ఒక విచిత్రమైన కోరికను వ్యక్తం చేశాడు. అవిభక్త భారత్ మళ్లీ ఏకం కావాలని, సింధు నది పూర్వ వైభవాన్ని సంతరించుకుని స్వేచ్ఛగా ప్రవహించాలని ఆకాంక్షించాడు. ఆ తరువాత తన చితా భస్మాన్ని ఆ నదిలో కలపాలని కోరుకున్నాడు. ఒకవేళ తన జీవితకాలంలో అది సాధ్యం కాకపోతే, తన తరవాతి తరాల వారైనా ఈ కోరికను నెరవేరుస్తారని ఆశించాడు.

నాటి నుంచి నేటి వరకు గాడ్సే చితాభస్మం పూణేలోని హిందూ మహాసభ కార్యాలయంలో భద్రంగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు, హిందూ మహాసభ కార్యకర్తలు ఆయన కోరికను గౌరవిస్తూ దానిని సింధు నదిలో కలిపేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. హిందూ మహాసభ కార్యాలయంలో గాడ్సే చితాభస్మంతో పాటు ఆయన ఉపయోగించిన కొన్ని వ్యక్తిగత వస్తువులు, చేతితో రాసిన నోట్స్ కూడా భద్రపరచబడి ఉన్నాయి. వీటిని సందర్శకుల కోసం అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు.

అస్థికలు కలిపే సమయం వచ్చిందా?

పహల్గామ్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై తీసుకున్న కఠిన నిర్ణయాలలో భాగంగా, సింధూ నది జలాలను పాకిస్తాన్‌కు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌తో కలిసి అఖండ భారత్ ఏర్పాటు కాకపోయినా, సింధూ నది భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా ప్రవహించనుందని. ఇప్పటికైనా ఆయన అస్థికలను సిందూ నదిలో కలుపుతారా లేదా అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో చర్చనీయాంశమవుతోంది.