Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీగంట్లకు విశ్వ దాత పురస్కారం ప్రధానము

గంట్లకు విశ్వ దాత పురస్కారం ప్రధానము

ఆదర్శనీయం..కాశీ నాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం

విశాఖపట్నం: జయజయహే : దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం, త్యాగం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కూన రాంజీ అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం, ఎలకుర్రులో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ స్థాయి విశ్వదాత అవార్డును విశాఖపట్నంకు చెందిన సీనియర్ పాత్రికేయులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు కు వీసీ రాంజీ, పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార రాజాలు చేతులు మీదుగా ప్రధానము చేసారు. వేద మంత్రాల నడుమ ఘనంగా సత్కరించి విశ్వ దాత అవార్డును, నగదు ప్రోత్సాహం అందించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా వీసీ కూన రాంజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమకాలంలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గాంధీజీ అడుగు జాడలో నడిచారన్నారు. వందేళ్ల క్రింద శ్యామల పాఠశాల ఏర్పాటు చేసి అందరికి విద్య అందించారన్నారు.. అలాగే అమృతాంజన్ సృష్టి కర్తగా, ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులుగా స్వాతంత్ర పోరాటం లో నాగేశ్వరరావు ఎంత గానో సేవలు అందించారని కొనియాడారు.. సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న వారి వంశీయులు నేడు మానసిక దివ్యాంగుల కోసం కేడీబీ ట్రస్టుని ఏర్పాటు చేసి ఉచితంగా విద్య, వైద్య సౌకర్యాలు అందించడంతోపాటు పలు వృత్తి విద్యాకోర్సుల్లో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారని కొనియాడారు..అదే కుటుంబానికి చెందిన విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు కాశీ నాధుని నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతటి మహోన్నత వ్యక్తి పేరిట ప్రతీ ఏటా విశ్వ దాత అవార్డు అందిస్తున్నామన్నారు… ఈ అవార్డును ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు కు అందించామని ఈ ఏడాది జర్నలిజం, సేవా రంగము లో విశాఖపట్నం జిల్లా సింహాచలం గ్రామం కు చెందిన గంట్ల శ్రీనుబాబు కు ఈ అవార్డు ను ప్రధానము చేయడం సంతోషం కలిగిస్తుంది అన్నారు.అవార్డు స్వీకరించిన అనంతరం గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ కాశీ నాధుని నాగేశ్వరరావు పంతులు అవార్డు తాను స్వీకరించడం పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నట్లు చెప్పారు..స్వాతంత్ర పోరాటములో గాంధీ తో కలిసి తన వంతు పాత్ర పోశించిన నాగేశ్వరరావు నేటి తరాలకు ఆదర్శనీయులు అన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయీ అవార్డు లు కంటే కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు పురస్కారం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు..విద్యా, వైద్య రంగాల్లో ఎంతో పేరు ప్రతిష్ట పొందిన నాగేశ్వరరావు నేటి తరము కు ఆదర్శ నీయులు అని కొనియాడారు..అంతకు ముందు కేడీబీ దివ్యాంగుల పాఠశాల, శ్యామల ప్రాధమిక పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆలరించాయి. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్మీ నారాయణ వేదాంతం పార్ధ సారధి, ముది గొండ రవి కుమార్, శివ లెంక ఉషా కిరణ్, ఎం ఎన్ వి ప్రసాద్ లు అతిధులు గా హాజారయ్యారు.. కార్యక్రమం సమన్వయకర్త గా ముదిగొండ శాస్త్రి తదితరులు అంతా కార్యక్రమం లో పాల్గొన్నారు..

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?