Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీకోర్టు ఆదేశాల మేరకు... ప్రజామోదంతోనే కాలువల గట్లపై ఆక్రమణల తొలగింపు

కోర్టు ఆదేశాల మేరకు… ప్రజామోదంతోనే కాలువల గట్లపై ఆక్రమణల తొలగింపు

ఆక్రమణలు ఎక్కడ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి కామ్రేడ్స్ … తొలగించకపోతే అప్పుడు నన్ను ప్రశ్నించండి

మంచి పనులు చేసినప్పుడు కితాబు ఇవ్వని కామ్రేడ్స్… వాళ్లకు తప్పనిపిస్తే మాత్రం మీడియాకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు

ఉండి నియోజకవర్గ పరిధిలో ఎన్నో కాలువలను బాగు చేయించాను… 65 గ్రామాలలో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయిస్తున్నాను… అయినా కమ్యూనిస్టులు ఒక్కనాడు మంచి మాట చెప్పి ఎరుగరు

ఏనాడు మంచి పనుల గురించి మాట్లాడని కామ్రేడ్స్ … ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కాలువగట్లపై ఆక్రమణలను తొలగిస్తుంటే మాత్రం అడ్డగోలుగా మాట్లాడడం సరికాదు

ఉపసభాపతిగా ఉండి ఇలా మాట్లాడడం సబబు కాదని నన్ను అంటున్న శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉండి అయన మాత్రం అలా మాట్లాడడం సబబేనా?

వివాదాన్ని మొదలుపెట్టిన శ్రీనివాసరావు ముందుగా నాకు సారీ చెబితే… ఆ తరువాత అయన కు సారీ చెప్పడానికి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు

జిల్లాస్థాయిలో కాదు సిపిఎం నేతలు రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయాలి … కాలువ గట్లపై ఆక్రమణలను తొలగించడం మంచిదో… కాదో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

కోర్టు ఆదేశాల మేరకు, ప్రజామోదంతోనే ఉండి నియోజకవర్గ పరిధిలోని కాలువ గట్లపై ఆక్రమణలను తొలగిస్తున్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కాలువ గట్లపై ఆక్రమణల తొలగింపు అంశాన్ని సిపిఎం నాయకులు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం నాడు రఘురామ కృష్ణంరాజు తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటీవల పాలకోడేరు గ్రామంలోని రాస కాలువ మీద ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. రాస కాలువలోని నీళ్లు కొడవల్లి అనే గ్రామంలో మంచినీటి చెరువులోకి వెళ్తాయన్నారు. కొడవల్లి గ్రామస్తులు ఒకరోజు తమ గ్రామంలోని తాగునీటి చెరువు శాంపిల్స్ తీసుకొచ్చి తనకు చూపెట్టారని తెలిపారు. అయితే, గ్రామస్తులు చూపెట్టిన తాగునీటి నమూనాలు సరైనవా?, కాదా? అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మనుషులను పురమాయించి గ్రామస్తుల తాగునీటి చెరువులో నుంచి నీటి నమూనాలను తెప్పించుకున్నానని వెల్లడించారు. తాగునీటి నమూనాలలో అతి దారుణంగా జల కాలుష్య ఆనవాళ్లు కనిపించాయన్నారు. రాస కాలువ గట్లను ఆక్రమించుకొని 150 గృహాల వారు విసర్జనలు, ఆ కాలువలోనే కలుస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కోర్టు తీర్పులు కూడా మంచినీటి సంరక్షణకు అనుకూలంగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాలువ గట్లు, మంచినీటి చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేపడితే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. అయితే చెరువుగట్లపై 40 సంవత్సరాల నుంచి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే… ఎందుకున్నాయో నాకైతే తెలియదన్నారు. 40 ఏళ్ల క్రితం నేను ఇక్కడ లేనని, నేను ప్రజా ప్రతినిధిగా ఎంపికైన వెంటనే నన్ను ఢిల్లీకి తరిమి వేశారని పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఏమి పీక లేదని ఎవరైనా ప్రశ్నిస్తే… నన్ను ఢిల్లీలో పీకి పెట్టారని అందుకే ఏమీ చేయలేకపోయానన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దుంపగడప గ్రామంలో కలుషిత తాగునీటి వల్ల సమస్య మొదలయ్యిందన్నారు.

అంతు చిక్కని వ్యాధులు… అన్నింటికీ కలుషిత తాగునీరే కారణం

దుంపగడప గ్రామంలో అంతుచిక్కని వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యలన్నింటికీ కలుషిత తాగునీరే కారణమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అంతుచిక్కని వ్యాధులకు కారణం కలుషిత తాగునీరేనని ఒక కమిటీ తేల్చినట్లుగా ఆయన వెల్లడించారు. ఆకివీడు, అయి భీమవరం రోడ్డుమీద చాలా దారుణంగా ఉండేది. ఆ

చెత్తంతా చిక్కగా ఉండేది. కాలువ లలో వెళ్లే నీటిలో కలిసేది. ఆ కలుషిత జలాలను సేవించి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. కాలువ గట్లపై ఉన్న గృహాలను యుద్ధప్రాతి పదికను తొలగించడం జరిగింది. కాలువ గట్లను ఆక్రమించుకొని పిల్లను నిర్మించుకున్న వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను, గ్రాంట్లను మంజూరు చేయడం జరిగింది. పది నుంచి 12 మంది కొత్తగా వస్తే వారికి కూడా ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను, గ్రాంట్లను ఇచ్చినట్లు మంజూరీ చేసినట్లు గుర్తు చేశారు. కాలువగట్లను ఆక్రమించుకున్న వారు ఇళ్లను తొలగించడానికి నోటీసులు ఇస్తే, కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. మంచినీటి కాలువలపై ఆక్రమణలు ఉండడానికి వీలులేదని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. కోర్టు అనుమతితోనే కాలువ గట్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాలతోనే అన్ని గ్రామాలలో మంచినీటి కాలువలు, చెరువుగట్లపై ఉన్న ఆక్రమణలను తొలగించినట్లుగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

ఉండి లో రోడ్డు ఆక్రమణలను కూడా తొలగించాం

ఉండి పట్టణ కేంద్రంలో రోడ్డు ఆక్రమణలను కూడా తొలగించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. రోడ్డును ఆక్రమించుకొని నిర్మించిన సిపిఎం పార్టీ కార్యాలయాన్ని కూడా ఆరు నెలల క్రితం తొలగించినట్లుగా ఆయన పేర్కొన్నారు. పాలకోడేరు గ్రామంలోని రాస కాలువ గట్టుపై ఆక్రమణలను తొలగించడానికి నోటీసులను ఇవ్వడం జరిగిందన్నారు. నోటీసులను అందుకున్న వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలతో నిబంధనల ప్రకారం కొన్ని గృహాలను తొలగించడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, మిగిలిన గృహాలను కూడా మరో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తొలగించనున్నట్లుగా తెలిపారు. కోర్టుకు వాస్తవాలను చెప్పి , సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గుర్తు చేసి… ప్రజారోగ్యం దృష్ట్యా, కాలువ గట్లను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకున్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లను అలాట్ చేసి, ఇంటి నిర్మాణానికి గ్రాంట్లను మంజూరు చేసి… తొలి విడత 50 గృహాలను తొలగించడం జరిగిందన్నారు.

ఎన్నికల సమయంలో శ్రీ సాక్షి వాడు ప్రతిరోజు పావు పేజీ రాశాడు… ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసులన్నింటి గురించి ప్రస్తావించా

శ్రీనివాసరావు ఎవరో నాకు తెలియదు. ఇటీవలే ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అని తెలిసింది. బివి రాఘవులు వంటి పెద్దవాళ్లు చేసిన పోస్ట్ అది. ఆయన పాలకోడేరు రాస కాలువ వద్దకు వచ్చారట. ఖబర్దార్ అంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు. రుణాలు ఎగగొట్టావ్… రుణాలు ఎగగొట్టిన నీకు ఇండ్లను తీసే హక్కు ఎక్కడిదనే విచిత్రమైన ప్రశ్నలు వేశారు. నాకు 30 రోజులపాటు టైం ఇస్తానంటే… నేను ఎవడి శ్రీనివాసరావు అని అన్నాను. శ్రీనివాసరావు ఎవరో నాకు తెలియదు. నేను శ్రీనివాసరావుకు తెలుసో లేదో కూడా తెలియదని అన్నాను. పాలకోడేరు లో అన్ని నిబంధనలను పాటించిన తర్వాతే ఇండ్లను తొలగించడం జరిగింది. దానికి ఇలాగా మోకాలికి బోడి గుండు కి ముడిపెట్టినట్లుగా శ్రీనివాసరావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. నామీద ఏ కేసులయితే మోపబడ్డాయో… ఆ కేసులన్నింటి గురించి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాను. వాటి గురించి ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో శ్రీ సాక్షి పేపర్ ప్రతిరోజు పావు కేజీ నాకోసమే కేటాయించి, ఈ కేసుల గురించి రాసేది. ఈ కేసులు నా మీద ఎలా ఆపాదించబడ్డాయో అందరికీ తెలుసునని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ప్రజామోదంతోనే ఇండ్ల తొలగింపు

ప్రజామోదంతోనే ఇండ్లను తొలగించడం జరిగిందని, అది కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇండ్ల తొలగింపు పై శ్రీ సాక్షి ఛానల్ లో శ్రీనివాసరావు స్టేట్మెంట్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా సిపిఎం స్థానిక నాయకులు ఎవరికి వారు నాకు వార్నింగులు ఇస్తూ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు. నిన్న బురిడీ వాసుదేవరావు అనే వ్యక్తి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు బురిడీ నేనా అంటూ రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. అవునని వారు సమాధానం చెప్పడంతో… లేకపోతే నేనే బురిడీ అన్నానని అంటారని చమత్కరించారు. ముఖ్యంగా శ్రీనివాసరావు భే షరతుగా నన్ను క్షమాపణలు చెప్పాలని కోరారు. నోటిని శుద్ధి చేసుకోవాలన్నారు. ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు తో కాబట్టి , ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సబబు కాదని ఆయన ఒక చక్కటి సూచన చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉండి శ్రీనివాసరావు ఇటువంటి మాటలు మాట్లాడడం సబబేనా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేను ఏమీ చేయలేను. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లాంటి పెద్ద పదవిలో ఆయన కొనసాగుతున్నారు. నాకు ఇప్పటివరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎవరో తెలియదు. ఎందుకంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వంటి వారు నాకు వ్యక్తిగతంగా తెలుసునని, వారితో పరిచయం ఉందన్నారు. శ్రీనివాసరావు ఎవరో నాకు తెలియదని, ఆయన్ని ఇంతవరకు చూడలేదు అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదని, పోటీ చేయలేదు కదా అంటూ మీడియా ప్రతినిధులతో కూడా ఆయన ధ్రువీకరించుకున్నారు. శ్రీనివాసరావు అంటే ఎవరో స్థానిక నాయకుడని అనుకున్నానని తెలిపారు.

ఈ వివాదానికి ఆధ్యుడు కామ్రేడ్ శ్రీనివాసరావు

ఈ వివాదానికి ఆధ్యుడు కామ్రేడ్ శ్రీనివాసరావు అని, కామ్రేడ్ శ్రీనివాసరావు నన్ను క్షమాపణలను చెప్పమని అడిగారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కామ్రేడ్ శ్రీనివాసరావు ముందుగా నాకు సారీ చెబితే, ఆయనకు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ వివాదానికి ఆద్యుడైన ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడేసి, నన్ను సారీ చెప్పమని అడిగితే… ఎలా సారి చెప్పగలనని ఎదురు ప్రశ్నించారు. ప్రేమ లేఖలు సినిమాలో నాగేశ్వరరావుతో సావిత్రి అన్నట్లుగా అంత ఈజీగా సారీ అనలేనని తెలిపారు. ముందు ఆయన సారి చెబితే నేను సారీ చెబుతానని… ఇది ఆయన వరకు మాత్రమేనని తెలిపారు. బురిడీలు, సీసాలు హ్యాపీగా, నిరభ్యంతరంగా రఘురామ దౌర్జన్యాలు నశించాలి… రఘురామ కృష్ణంరాజు భర్త రఫ్ చేయాలి, డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి ఆయన్ని వెంటనే చంద్రబాబు నాయుడు తొలగించాలని మాట్లాడుకోవచ్చునంటూ ఎద్దేవా చేశారు. ఒక్క ఉండిలోనే కాదని, తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు ప్రాంతాలలో మాట్లాడుతున్నారన్న రఘురామకృష్ణం రాజు, ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం ఈ నినాదాలను చేసుకోవచ్చునన్నారు. నేను చేస్తున్నది మంచో, చెడో అన్నది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం, కోర్టు అనుమతితో నేను చేస్తున్న ఈ కార్యక్రమం మంచిదో కాదో రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలంటే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియాలన్నారు. ఇక్కడితో ఈ వివాదాన్ని ముగిద్దామని అనుకుంటే ముగిద్దాం. మీ ఇష్టం మీరు సారీ చెబితే నేను సారీ చెబుతానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. లేదంటే మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఒక నియోజకవర్గానికి పరిమితమైన నన్ను, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారని, మీరు రాష్ట్రస్థాయి నాయకుడు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు . అది మీ విచక్షణకు వదిలి వేస్తున్నట్లు, డిమాండ్ మాత్రం చేయడం లేదన్నారు. నిన్నెవరో న్యాయవాదులట … సిపిఎం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు ఏమో తెలియదు. ఆ న్యాయవాదులు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నారని … ఎందుకు ఇస్తున్నారో తెలియదన్నారు. ఐ నో వాళ్ళ వార్నింగ్ పట్టించుకునేది ఎవరు అంటూ ప్రశ్నించారు. నా కార్యక్రమాలను నేను చేస్తాను. సిపిఎం పార్టీ వారికి ముందే షెడ్యూల్ ఇస్తున్నాను. కోర్టు అనుమతితో మరో 15 రోజులలో పాలకొల్లు రాస కాలువ గట్లపై అక్రమంగా నిర్మించిన మిగిలిన గృహాలను కూడా తొలగిస్తాం. న్యాయబద్ధంగానే ఈ ప్రక్రియ చేపడుతాం. నియోజకవర్గ పరిధిలో ఇంకా చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. ఆక్రమణలున్న ప్రతిచోట వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాన్ని కేటాయించి, ఇంటి నిర్మాణానికి గ్రాంట్ మంజూరు చేసి, ఇండ్లను తొలగించడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఆ లేఅవుట్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అప్పటివరకు తాత్కాలికంగా వేరే చోట అడ్జస్ట్ కావలసిన అవసరం ఉందన్నారు.

ఇల్లు కూలిన తర్వాత కూడా పొయ్యిపై పాత్ర లో టమాటాలు అలాగే ఉంటాయా?

ఇల్లు పడిపోయిన తర్వాత కూడా పొయ్యి అలాగే ఉంటుందా?, పొయ్యి పైన ఉన్న పాత్రలో టమాటాలు అలాగే ఉంటాయా?? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు . బహుశా అది ట్రిక్ ఫోటోగ్రఫీ అయి ఉంటుంది. నేను చెప్పే చేస్తున్నాను… అందరికీ చెప్పే చేస్తున్నాను. ప్రజల సంపూర్ణ ఆమోదంతోనే చేస్తున్నాను. అక్కడ ఉన్న పదిమందికి ఇబ్బంది రావచ్చు. కానీ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన తర్వాత బొండాడ గ్రామంలో 22 గృహాలను తొలగించాము. గ్రామస్తులతో మాట్లాడి వారందరికీ

ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశాము. అంతా సుఖంగా జరిగిపోయింది. ఎందుకంటే అక్కడకు కామ్రేడ్స్ రాలేదు కాబట్టి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. నాకు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దాన్ని ఇలాగా కామ్రేడ్స్ వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి, వచ్చిన వాళ్లకు ఫోటోలను ఇచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత లాయర్లు వస్తారని ఆ తర్వాత మహిళలు వారితో ఫోటోలను దిగుతారని, మరుసటి రోజు పత్రికల్లో ఫోటోలను వేయించుకుంటారన్నారు.. లాయర్లే మో… నీ ధమనకాండ అడ్డుకుంటామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారని అపహాస్యం చేశారు. ఎవరైనా నా దగ్గరకు రావచ్చునని, నేనేమీ చాటుగా వ్యవహారం చేయడం లేదని కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపారు. ప్రజలు మంచినీటి కోసం కాలువలపైనే ఆధారపడ్డారని, కాలువ గట్ల ఆక్రమణలను కచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. కాలువ గట్లను ఆక్రమించుకున్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లను ఇస్తున్నామని వివరించి చెప్పి, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆక్రమణలను తొలగించాడానికి సహకరించాలని కోరుతున్నామన్నారు.

ధనిక, పేద అన్న తేడా లేకుండా కూల్చివేతలు

ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా ధనిక, పేద అన్న తేడా లేకుండా కూల్చి వేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. పెద అమిరం రోడ్డు లో ఆక్రమణలను కూల్చివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడ మూడున్నర ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని చేపట్టే అవకాశం లభించింది అన్నారు. 40 ఏళ్లుగా ఈ స్థలాలను ఆక్రమించుకున్నారని, ఇందులో ధనికులు, పేదలు ఉన్నారని గుర్తు చేశారు. పెద్ద, పెద్ద బంగ్లాలు, ఫ్యాక్టరీలు, ఆస్పత్రులు ఉన్నాయని గుర్తు చేశారు. తనకు ధనిక, పేద అన్న తేడా తెలియదన్నారు. రఘురామ కృష్ణంరాజు గారు కేవలం పేద వాళ్లకు ఇండ్లను మాత్రమే కూలబడుతున్నారని తప్పుడు ఆరోపణలను చేస్తున్నారన్నారు. ఇదంతా శుద్ధ అబద్ధమని, పెద అమిరం రోడ్డు లో కూల్చివేతల్లో ఎంత పెద్ద భవనాలు ఉన్నాయో చూడాలన్నారు. పొలాలు, కాలువ గట్ల ఆక్రమణలపై కూడా ఉక్కు పాదం మోపుతామని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు.

అప్పుడు నేను ధనికపక్షపాతినని అనండి

ఎక్కడైనా ఆక్రమణలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని కామ్రేడ్స్ ను కోరుతున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు . ఆక్రమణలను తొలగిద్దామన్న ఆయన, ఆక్రమణలను తొలగించకపోతే, అప్పుడు నన్ను ధనిక పక్షపాతి అని అనాలని సూచించారు. నేను కొట్టేసిన వాటిలలో ధనికులవి, కోటీశ్వరుల ఇండ్లు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం పేదల ఇండ్లను మాత్రమే కూల్చుతున్నామని కామ్రేడ్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. కామ్రేడ్ మాటలను కొంతమంది నమ్మవచ్చు. ఓపెన్ గా పబ్లిక్ కు సంజాయిషీ అనుకోండి… సమాచారం అనుకోండి, మీడియా ద్వారా పబ్లిక్ కు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణం రాజు అన్నారు.

మీరు అడ్డం రానంటే తొలగిద్దాం…

బొండాడ గ్రామంలో ఈ కేవలం 22 ఆక్రమణలను మాత్రమే తొలగించారని, ఇంకా 30 వరకు ఆక్రమణలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు దృష్టికి ప్రజాశక్తి ప్రతినిధి తీసుకురాగా… మీరు అడ్డం రానంటే ఆ ఆక్రమణలను కూడా తొలగిద్దామని ఆయన చమత్కరించారు. ఆక్వా పరిశ్రమలు వదులుతున్న నీటి వల్ల కూడా పంట కాలువలు కలుషితమవుతున్నాయన్న ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… మొన్న ఆక్వా రైతులతో వారి సమస్యల గురించి మాట్లాడడమే కాకుండా, వారి వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యల గురించి కూడా మాట్లాడానని తెలిపారు. ఆక్వా రైతుల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే తన మన భేదం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లుగా తెలిపారు. ఆక్వా రైతులు ఇటీవల ఒకటి రెండు తప్పులు చేస్తే, అవే చివరి తప్పులుగా భావించాలని చెప్పి గ్రామ పెద్దలకు చెప్పి దేవాలయానికి, గ్రామ అభివృద్ధి కోసం విరాళాలను ఇప్పించానన్నారు.

ఉండి లో కాలువల వద్ద చెత్త వేయడం తగ్గింది

ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువల వద్ద చెత్త వేయడం 90 శాతం వరకు తగ్గిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. దానితో ఒక మీడియా ప్రతినిధి స్పందిస్తూ… కాలువలు కాలువాల మాదిరిగా కనిపిస్తున్నాయి సార్ అని అన్నారు. కారు అద్దాలను దించి ఉండి కాలువలలో చెత్త వేసే హక్కు లేదా ? అని కామ్రేడ్లు ప్రశ్నిస్తే… లేదనే కరాకండిగా చెబుతామని, ఏదో ఒక చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని అన్నారు. ప్రజలకు స్వీయ నియంత్రణ ఎంతో అవసరమని ఆయన అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?