కోర్టుల పనీ పోలీసులే చేస్తారా ? రోడ్డుపై కొట్టి రౌడీ షీట్లా ? తెనాలిలో జగన్ విమర్శలు..!
రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుందనేది దానికి తెనాలి ఘటనే నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS jagan) తెలిపారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా వినిపించే గొంతుల్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ, సాక్ష్యాలు సృష్టిస్తూ, జైళ్లలో పెడుతున్నారో తాజా...