Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీకోన కు గంటా అభినందన

కోన కు గంటా అభినందన

విశాఖపట్నం, జయజయహే : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గా నియమితులైన కోన తాతారావు గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న తాతారావు సారథ్యంలో బ్యాంకు అభివృద్ధి పథంలో నడుస్తుందని గంటా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు బ్యాంకు భరోసాగా నిలవాలని సూచించారు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సలహాలు, సూచనలతో బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేస్తానని కోన తాతారావు చెప్పారు. ఈ సందర్భంగా కోన తాతారావును గంటా సన్మానించి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?