SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 7:19 am Posted by : SHIVASURYA NEWS

కొండూరు కళా ప్రతిభకు అవార్డు

జయజయహే : తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి విందూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రచయిత కొండూరు వెంకటేశ్వరరాజుకు మాతృమూర్తి ఆశీర్వాద అవార్డు -2025 లభించింది. అంతర్జాతీయ మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోండా పట్టణానికి చెందిన ఆలిండియా సేవా సంస్థ శాంతి ఫౌండేషన్ వారు నిర్వహించిన వెరైటీ ఆర్ట్స్ పోటీలో పాల్గొని, అమ్మ ఔన్నత్యాన్ని తెలిపే పోస్టర్ ఆర్ట్ ను రూపొందించినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన దృవపత్రాన్ని శనివారం అంతర్జాలం ద్వారా అందుకున్నారు. ఈ సందర్భంగా సహచర కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరాజును అభినందించారు.