కొంచెం ఓపిక పట్టండి.. మారణహోమం ముందుంది.. రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని భావిస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.' కొంచెం ఓపిక పట్టండి..భారత్ లోని ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది. దేశంపై కన్నెత్తి చూసిన వాళ్లకు గట్టి గుణపాఠం చెబుతాం. అసలైన దాడులు జరిగేందుకు కొంచెం ఓపికతో ప్రజలు ఉండాలి' అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరన్ మహోత్సవ్ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు....