మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ ముఖ్యులతో సహా జగన్ వద్ద కీలక వ్యక్తులను అరెస్ట్ చేసారు. దీని పైన స్పందించిన జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసా గుతోందని మండిపడ్డారు. కేసులు.. జైళ్లకు భయపడేది లేదన్నారు. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీ యాలు చేయగలమని చెప్పకొచ్చారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నేడు నాడుతున్న విత్తనాలు.. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరికీ సినిమా చూపించేందుకు కారణమవుతాయని జగన్ హెచ్చరించారు.
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమయంలో అరెస్టుల అంశం పైన స్పందించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సంఖ్యా బలం లేకపోయినా నర్సరావుపేట, కారంపూడిలో గెలుచుకున్నామని ప్రకటించుకున్నారని గుర్తు చేసారు. రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అక్రమాలకు అంతే లేదని వ్యాఖ్యానించారు. పది శాతం మంది ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారని.. ఎప్పుడు ఎన్ని కలు వచ్చినా ఫుట్ బాల్ లా ఎగిరి తంతారన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసారని జగన్ మండిపడ్డారు. ఏ పంటకు కనీస మద్దతు ధర రావటం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అక్రమ అరెస్టులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తప్పుడు కేసులు.. వాంగ్మూలాలతో వేధిస్తున్నారని జగన్ పేర్కొ న్నారు. వైసీపీలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ కార్యకర్త కష్టాన్ని చూస్తున్నానని.. వారికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయిదేళ్లు పాలన లో కోవిడ్ కారణంగా అనుకున్నంత మేర సరిగ్గా చేయలేకపోయామని వివరించారు. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొట్టాలనుకుంటే కొట్టమనండి.. కానీ, అన్యాయాలు చేసిన ప్రతీ ఒక్కరికీ సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. ఎవరు ఎక్కడ ఉన్నా లాక్కొస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు నాటుతున్న విత్తనాలు ఈ పరిస్థితిని తీసుకొస్తాయని వ్యా ఖ్యానించారు. వంశీతో సహా పలువురిని నెలల తరబడి జైల్లో పెడుతున్నారని సీరియస్ అయ్యారు. దళితుడైన నందిగం సురేశ్ విషయంలోనూ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
వచ్చేది మన ప్రభుత్వమే వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమేనని పార్టీ నేతలతో జగన్ ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు నేడు నాడుతున్న విష విత్తనాలు రేపు పెరిగి పెద్దదవుతుందనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలని సూచించారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఏ ప్రభుత్వం పైన అయినా వ్యతిరేకత రావాలంటే సమయం పడుతుందని.. చంద్రబాబు ప్రభుత్వం పైన అతి తక్కువ సమయంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. పోలీసులు వైసీపీ వాళ్లని అరెస్ట్ చేసి.. టీడీపీ వాళ్లను వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పుకో వాల్సిన పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు

