కేరళ తీర ప్రాంతంలో భారీ నౌకకు ప్రమాదం.. ప్రజలకు ఆ విషయంలో అలర్ట్ !
కేరళ తీర ప్రాంతానికి సమీపంలోని అరేబియా సముద్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. సముద్ర తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దాదాపు 184 మీటర్ల పొడవున్న కార్గో నౌక MSC ఎల్సా-3.. 26 డిగ్రీల మేర ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌక నుంచి ఆయిల్ కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. ఈ నౌక విష్ణుజం నుంచి కొచ్చికి వెళ్లే దారిలో ఉండగా ఒక్కసారిగా వాలిపోయినట్టు చెబుతున్నారు. దాంతో సుమారు పది కంటైనర్లు సముద్రంలో...