కెసిఆర్ 660 కోట్లతోనే సచివాలయం నిర్మాణం చేసారు.. చంద్రబాబుకు లక్షల కోట్లు ఎందుకు –జగన్.
రాష్ట్రంలో స్కాంలన్నింటికీ పరాకాష్ట నేడు అమరావతిలో జరుగుతున్న దోపిడీ అని జగన్ ఆరోపించారు. 2018లో అమరావతిలో పిలిచిన టెండర్ల విలువ 41 వేల కోట్లని, ఇందులో 5 వేల కోట్ల పనులు చంద్రబాబు గతంలోనే పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు 35 వేల కోట్లు మాత్రమేనని, ఈ టెండర్లు రద్దు చేసి మిగిలిన పనుల అంచనాలను పెంచేసి భారీ దోపిడీ చేస్తున్నారన్నారు. దీని కోసం వైసీపీ హయాంలో అమలు చేసిన జుడిషియల్ ప్రివ్యూను, రివర్స్ టెండర్లను తీసేశారన్నారు. వీటి కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని...