కెజీహెచ్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటుకు సిఫారసులు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

విశాఖపట్నం: జయజయహే "కెజిహెచ్ జన్మదిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేంద్రం ఆవరణలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసేలా విశాఖ జిల్లా ఉన్నతాధికారులకు వివిధ సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్సీపిసి ఆర్)సభ్యులు గొండు సీతారాం చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రసూతి వార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనన ధ్రువీకరణ పత్రాల జారీ కేంద్రాన్ని బుధవారం ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్...