కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులపై దాడులు ప్రజాసౌమ్యంలో అన్ని కుల, మతాలను సమానంగా చూసే భాద్యత ప్రభుత్వాలది డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ
విశాఖపట్నం జయ జయహే: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైయస్సార్సీపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట్రంలోని క్రైస్తవులందరకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీఎస్సిఎంఎఫ్సి మాజీ చైర్మన్ మద్దిరాల జోసెఫ్ ఇమ్మానుయేల్ వ్యాఖ్యలను ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని తెలియచేస్తూ,పాస్టర్లకు గౌరవ వేతనం 50 కోట్లకు పైగా బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించవలసి ఉన్నదని ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 29 కోట్ల 49 లక్షల 45 వేల...