కూటమి ఏడాది పాలనలో ప్రజలను మోసం చేయడం తప్ప ,చేసిందేమి లేదు—అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డు-విద్యుత్ ఒప్పందాల్లో భారీ స్కాం- జగన్ ఫైర్..!
చంద్రబాబుతోనే కాదు ఎల్లో మీడియా వ్యవస్ధతోనూ యుద్దం చేస్తున్నామని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. నాణేనికి రెండో వైపు కూడా తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన చేతిలో అభివృద్ధి మంత్రం ఉందని, సంపద సృష్టిస్తానని, జగన్ ఇస్తున్నవన్నీ ఇస్తానని, అంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పారన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని, తాను అంతా మార్చేస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో అభివృద్దీ కనిపించదు, సంక్షేమమూ కనిపించదని జగన్ తెలిపారు. కాగ్ నివేదిక కూడా అదే చెప్పిందన్నారు. ఈ...