Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీకూటమి ఏడాది పాలనలో ప్రజలను మోసం చేయడం తప్ప ,చేసిందేమి లేదు---అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డు-విద్యుత్...

కూటమి ఏడాది పాలనలో ప్రజలను మోసం చేయడం తప్ప ,చేసిందేమి లేదు—అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డు-విద్యుత్ ఒప్పందాల్లో భారీ స్కాం- జగన్ ఫైర్..!

చంద్రబాబుతోనే కాదు ఎల్లో మీడియా వ్యవస్ధతోనూ యుద్దం చేస్తున్నామని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. నాణేనికి రెండో వైపు కూడా తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన చేతిలో అభివృద్ధి మంత్రం ఉందని, సంపద సృష్టిస్తానని, జగన్ ఇస్తున్నవన్నీ ఇస్తానని, అంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పారన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని, తాను అంతా మార్చేస్తానని చంద్రబాబు చెప్పారన్నారు.

చంద్రబాబు ఏడాది పాలనలో అభివృద్దీ కనిపించదు, సంక్షేమమూ కనిపించదని జగన్ తెలిపారు. కాగ్ నివేదిక కూడా అదే చెప్పిందన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్ర రాబడి చూస్తే ప్రభుత్వ పనితీరు తెలుస్తోందన్నారు. కేవలం 3.08 శాతం అభివృద్ది రేటు కనిపిస్తోందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నారు. చంద్రబాబు పనితీరు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పోలిస్తే 30 శాతం ఎక్కువ అప్పులు చేసినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని జగన్ ఆరోపించారు. మూలధన వ్యయం చూసినా వైసీపీతో పోలిస్తే మైనస్ 17 శాతంతో దారుణంగా ఉందన్నారు. ఈ డబ్బులన్నీ చంద్రబాబుతో పాటు ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాడన్నది దీంతో తేటతెల్లం అవుతుందన్నారు. గతంలో ఐదేళ్లలో తాము 3 లక్షల 32 వేల 671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు ఈ 12 నెలల కాలంలోనే ఏకంగా లక్షా 37 వేల 564 కోట్ల అప్పు చేశాడన్నారు. ఇది వైసీపీ పాలనతో పోలిస్తే 41 శాతం అదనంగా ఉందన్నారు. అమరావతి కోసం చేసిన రుణాలు 31 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. ఏపీఎండీసీ పరిధిలో గనులపై 9 వేల కోట్ల అప్పు చేశారన్నారు. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు.

యాక్సెస్ సంస్థ నుంచి యూనిట్ కు రూ.4.60 పైసలకు విద్యుత్ కొనుగోలు చేయడం దారుణమని వైఎస్ జగన్ ఆరోపించారు. తమ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్ కు రూ.2.49పైసలకు మాత్రమే అన్నారు. దీంతో పోలిస్తే యాక్సెస్ ఒప్పందంలో యూనిట్ కు రూ.2.11 పైసలు అదనం అన్నారు. 25 ఏళ్ల పాటు దీన్ని కొనుగోలు చేయడం అంటే ఏడాదికి 440 కోట్ల స్కాం జరుగుతోందన్నారు. దీంతో పాతికేళ్లలో 11 వేల కోట్లు ప్రజాధనం వృధా చేయడానికి చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు.

గతంలో తాము కుదుర్చుకున్న రూ.2.49 పైసల సెకీ విద్యుత్ ఒప్పందంతో ఇప్పటికీ రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్టీపీసీ సహా ఇతర సంస్థలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లోనూ సగటున యూనిట్ కు రూ.3.53 పైసలు ఖర్చవుతుందన్నారు. దీంతో పోల్చినా తాజాగా యాక్సిస్ తో చేసుకున్న ఒప్పందంతో కనీసం 6 వేల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వక్రభాష్యాలు చెప్తోందన్నారు. సెకీతో తాను కుదుర్చుకున్న ఒప్పందం వల్ల దాని సీఎండీ రామేశ్వర్ గుప్తాను తొలగించారంటూ ఈనాడు కథనం ప్రచురించడం దారుణమని జగన్ తెలిపారు. తాము ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్ 1 అయితే 2023 జూన్ ల ో సెకీ సీఎండీగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని దాచిపెట్టి ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారన్నారు. దున్నపోతు ఈనితే దూడను కట్టేయమన్నట్టుగా ఇది ఉందన్నారు. ఊరూ పేరులేని ఉర్సా సంస్ధకు విశాఖలో రూపాయికి 3 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం కంటే పెద్ద స్కాం ఉందా అని జగన్ ప్రశ్నించారు. విశాఖలో ఓ మాల్ కట్టడానికి 2 వేల కోట్ల విలువైన భూమిని లులూకు ఇవ్వడం కూడా ఇలాంటిదే అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక, లిక్కర్, మట్టి మాఫియా చెలరేగిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకుండా వేల కోట్లు దోచేస్తున్నారన్నారు. 80 లక్షల టన్నుల ఇసుక తాాము వేసవి కాలంలో స్టాక్ పెట్టేవారమని, రెండు నెలల్లో దీన్ని కూటమి ప్రభుత్వం ఊడ్చేసిందన్నారు.
చంద్రబాబు సీఎం అయి ఏడాది దాటిందని, ఈ ఏడాదిలో ఒక్క పథకం అమలు చేసింది లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయన్నారు. మే నెల పూర్తి కావొస్తుందని, ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వలేదని, రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. ఇస్తానన్న అమ్మఒడీ ఇవ్వడం లేదన్నారు. ప్రతీ ఒక్కరికీ 15 వేల చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తానని ఎగనామం పెట్టారన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఊసులేదన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి 36 వేలు భృతి ఇవ్వడం లేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ మోసం అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెనా లేదన్నారు. ఆరోగ్యశ్రీకి 3500 కోట్లు పెండింగ్ పెట్టారన్నారు. స్కూళ్లూ, హాస్పిటళ్లూ, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. విచ్చలవిడిగా అవినీతి మాత్రం చేస్తున్నారన్నారు. కరెంటు రేట్లు పెంచి ఏడాదిలో 15 వేల కోట్లు వసూలు చేశారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?