కుప్పం, గుంటూరు, మాచర్లలో కూటమిదే హవా
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న కుప్పం, గుంటూరు, మాచర్ల మున్సిపల్ పీఠాల్ని ఇప్పుడు కూటమి సర్కార్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా స్ధానాల్లో ఉన్న మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు తప్పుకోవడమో, అవిశ్వాసంలో పదవులు కోల్పోవడమూ జరిగింది. దీంతో ఈ సీట్లను ఇవాళ ఎన్నికల ద్వారా కూటమి సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది. ముందుగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పలువురు వైసీపీ సభ్యులు టీడీపీవైపు ఫిరాయించారు. దీంతో...