Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీకుట్టుమిషన్లు ఇస్తామని కుచ్చుటోపి పెట్టిన కూటమి సర్కార్

కుట్టుమిషన్లు ఇస్తామని కుచ్చుటోపి పెట్టిన కూటమి సర్కార్

బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం భారీ స్కాం

విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు

విశాఖపట్నం: జయజయహే : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆ పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్రభారత్ మాట్లాడుతూ కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి తద్వారా సుమారు 150 కోట్ల స్కాం కూటమి ప్రభుత్వం జరిపినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలుకు, కాపు మహిళలకు కుట్టు శిక్షణలో 150 కోట్ల పైగా భారీ కుంభకోణం జరిగినట్టు చెప్పారు… తొలుత 100 కోట్లతో ప్రతిపాదించిన ఈ శిక్షణ పధకం 257 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పి 45 రోజులు గడిచిన 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదు ఈ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం సాగుతుందని దుయ్యబట్టారు ఇందులో మొదటి నుంచి కూడా జరిగిన అవినీతిని వివరిస్తూ టెండర్ లో పాల్గొన్న ఎల్ 1కు కేవలం 5% పని మాత్రమే అప్పగించి ఎల్ టు, ఎల్ త్రీ కి సుమారు 95 శాతాన్ని పని అప్పగించడంతో వీరి యొక్క అవినీతి ఏ రకంగా ఉందో తెలుస్తుందని అన్నారు గుజరాత్ లో తక్కువ నాణ్యత కలిగిన మిషన్లను తీసుకువచ్చి 4300 విలువ చేసే కుట్టు మిషన్ కొనుగోలు చేసి ఒక వ్యక్తి ట్రైనింగ్ గాను కాంట్రాక్టర్ అవుట్సోర్సు కు 3000 రూపాయలు కేటాయించగా ఒక లక్ష మందికి 7300 చొప్పున 73 కోట్లు ఖర్చు అవుతుండగా టెండర్ మాత్రం రెండు వందల యాభై నాలుగు కోట్లు చూపించి సుమారు 167 కోట్లు అవినీతికి పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వం గురించి మరియూ తద్వారా బీసీ మహిళలకు జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని వారి పేరుతో జరుగుతున్న ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తామని సందర్భంగా చెప్పుకొచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?