కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు చిరస్మరణీయులు – జనచైతన్య వేదిక
జయజయహే : కీర్తిశేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు 1996లో శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి గుంటూరులో స్థాపించి వందలాది పేద, అంధ విద్యార్థులకు భోజన, వసతి తోపాటు విద్యను అందించిన మహనీయులు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి గుంటూరులోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవాసమితి అంధుల, వికలాంగుల, అనాధల శిక్షణాలయంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెలగపూడి పాండురంగారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య...