SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 9:11 am Posted by : SHIVASURYA NEWS

కాల్చి పడేసిన మహిళా మృతదేహం

భీమిలి : జయజయహే : భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో,భీమిలి సాగర తీరంలోని ఫార్చ్యూన్ లేఔట్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం సగం కాలి ఉన్న మృతదేహాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,దర్యాప్తు చేపట్టారు. మహిళను చంపి మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీపీ అప్పలరాజు, సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.