Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీకార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు

కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు

కార్మికులకు అండగా ఉంటానన్న డాక్టర్ కందుల

జయాయహి : కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. మేడే పురస్కరించుకొని గురువారం ఉదయం అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల తన కార్యాలయంలో సుమారు 150 మంది రిక్షా కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటు చెప్పారు. కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉంటేనే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. మేడే అందరి పండుగని, ప్రతీఒక్కరు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్మికులు చాలిచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్నారని, ప్రతీ కార్మికునికి రావాల్సిన అన్ని లాభాలు సమకూరేలా ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కార్మికుల సహకారాన్ని గుర్తిస్తూనే, వారి భద్రత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కందుల కృష్ణ , సీపీఐ బుజ్జి , బాబులు శ్రీను , కుమారి , జానకీ , కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

                                             

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?