SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 8:44 am Posted by : SHIVASURYA NEWS

కాపులకు అండగా కూటమి ప్రభుత్వం – వి ఎం ఆర్ డి ఎ చైర్మన్

జయజయహే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాపులకు ఎల్లవేళల అండగా ఉంటుందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటన లో తెలిపారు. నగరంలో కాపు సామాజిక వర్గం కోసం కాపు భవనం నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో టీడీపీ హయంలో కాపు భవనం కోసం ఎకరా భూమి కేటాయిస్తే, వైఎస్ఆర్సీపీ హయాంలో అది 50 సెంట్ల కు కుదించారని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి ఎలాంటి నిధులు విడుదల చేయకుండా ఎన్నికల సమయంలో నాటి వైఎస్ఆర్సీపీ నేతలు హడావుడిగా భూమి పూజ చేసి వదిలేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపులకు చేసింది ఏమి లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయంలోనే కాపు భవనం నిర్మాణం తధ్యమని పేర్కొన్నారు.