SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 9:43 am Posted by : SHIVASURYA NEWS

కాన్సర్ బాధితునికి అండగా డాక్టర్.హర్ష చారిటబుల్ ట్రస్ట్

శ్రీకాకుళం : జయజయహే : డా.హర్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డోకి. శ్రావణ్ కుమార్ మంగళవారం కాన్సర్ బాధితునికి అండగా నిలిచి ఉదారత చాటుకున్నారని రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా, అంపోలుకు చెందిన ఉట్ల. హేమంత్ కుమార్ గత కొంత కాలంగా లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే, హేమంత్ కు, మూడునెలలకు సరిపడే నిత్యావసర సరుకులతో పాటు రైస్ ప్యాకెట్, ప్రోటీన్ బాక్స్ లను రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు చేతులమీదుగా అందించి మాట్లాడుతూ నగరంలో కొంత మంది సేవకులు కాన్సర్ బాధితునికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారన్నారని హేమంత్ కుటుంబం ఆర్ధికంగా వెనకబడినవారని శ్రావణ్ తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు, మణిశర్మకు, ఉర్లం. శివతేజకు, ఇదివరకు సహాయం చేసిన డేవిడ్ టీంకు, రాబిన్ హుడ్ ఆర్మీ విశాఖపట్టణం రేణుకకు, ఎమెర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ కు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు కు, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సెక్రటరీ సింధూర హాస్పిటల్ లైన్ డా. సింధూర కు, నల్ల గౌతమి, కె.విశ్వనాధ్, ప్రనణ్య దంపతులకు, పలాస ప్రాణదాత బ్లడ్ సెంటర్ మేనేజర్ సాయి, సిరుల శరత్ లకు, నేటిదాత డా.హర్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డోకి. శ్రావణ్ కుమార్ లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, డా. నిక్కీ అప్పన్న, ఉర్లం. శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధులు, నంది. ఉమా శంకర్, బి. జగదీశ్, పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.