Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీకలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన తైనాల

కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన తైనాల

విశాఖపట్నం జయ జయహే: విశాఖ మాజీ శాసన సభ్యులు వైస్సార్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్ కుమార్ వైస్సార్సీపీ విశాఖపట్నం పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ రవి రెడ్డి తో కలిసి గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందచేసారు. 2025 ఏప్రిల్ 19న జరిగిన ప్రత్యేక సమావేశం సంబందించిన ప్రక్రియల మినిట్స్ ప్రతిని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 2025 ఏప్రిల్ 20న రాసిన నా లేఖకు అనుసంధానంగా ఈ లేఖను రాస్తున్నాను, 2025 ఏప్రిల్ 19న నిర్వహించిన విశేష సమావేశం వివరాలు మరియు చర్యల మినిట్స్ కాపీని ఇవ్వమని తైనాల విజయ్ కుమార్ కోరారు. ఈ సమావేశం మాజీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి జివిఎంసి మేయర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమిత పార్టీ విప్ గా, మేము కోరిన పై పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాల్సిందిగా కోరుతూ మా పిర్యాదులపై తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?