కలెక్టరేట్ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
రక్తదానం చేసి స్ఫూర్తినింపిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, డీఆర్వో భవానీ శంకర్ విశాఖపట్టణం: జయజయహే : జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సౌసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో పాటు మొత్తం 149 మంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గురువారం వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, ఇండియన్...